ప్రతి వ్యక్తి జీవితాంలో ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అది మనం చేసే పూజా, ల రూపంలో దేవుడికి తెలియజేస్తాం.దైవం కోసం మన నివేదన తెలియజేయడానికి కొన్ని స్తొత్రాలను పఠిస్తాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాలసిన నాలుగు మంత్రాలను పఠించి, దాని సారాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితాంతం అదృష్టం, ధనం, ఆనందం మీ సొంతం అవి..
‘‘సర్వే క్షయాంత నిచాయంః పతనంతః సమ్రుశ్ఛాయః
సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్’’
దీని అర్థం.. విశ్వంలో అన్నింటికీ వినాశానం ఉంటుంది. ప్రతి అభ్యున్నతికి తిరోగమనం ఉంటుంది. ప్రతి సంయోగానికి వియోగం ఉంటుంది. ప్రతి జీవికీ అంతముంటుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. దాన్ని అర్థం చేసుకుని మనుగడ కొనసాగిస్తే జీవితం ఆనందంగా సాగుతుంది.
సర్వే క్షయాంత నిచాయంః
చాలామంది తమ జీవితాంతం డబ్బు సంపాదన కోసమే పాకులాడుతుంటారు. చివరికి వారికి మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి మనకు ఎంత ధనం అవసరమో అంతే వినియోగించాలి. మిగతాది దానం చేయాలి. దీనివల్ల పుణ్యం దక్కుతుంది.
పతనాంత సమ్రుశ్ఛాయః
దీనార్థం..జీవితంలో మనం సాధించే అభ్యున్నతి తిరోగమించాల్సిందే. ఉన్నత స్థానంలో ఉండేవారు ఎప్పుడూ ప్రగల్భాలకు పోకూడదు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతివ్యక్తి తమకు దిగువ స్థాయిలో ఉన్నవారిని ఆదరించాలి.
సంయోగ విప్రయోగాంత
మనిషి జీవితంలో సంయోగముంటే దానికి తగిన వియోగం కూడా ఉంటుంది. ఏదైన లభించినప్పుడు ఆనందపడటం, దూరమయ్యేటప్పుడు బాధపడటం చేయకూడదు.
మరణాంత చ జీవితమ్
మానవ సంబంధాలన్నింటిలో మనకు ప్రేమపూర్వకంగా ఉండాలి. కానీ, ఎవరైన చనిపోతే అందుకు పశ్ఛాత్తాపం పడకూడదు. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అంటే విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవం. మిగిలినవి తాత్కాలికమే.. ఈ నాలుగు మనం అర్థం చేసుకొని బతికితే జీవితం ధనప్రాప్తి కలిగి ఆనందంగా జీవితం కొనసాగించగలుగుతాం.