పాకిస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్లో మంగళవారం జరిగిందీ దుర్ఘటన.
ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న బస్సు.. హైవేపై ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేసు నమోదు చేసుకుని అసలైన కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.