ఆహా కరివేపాకు ఇంత ఉపయోగమా…?

-

ఆక్, పాక్ కరేపాక్ అంటూ కరివేపాకుని తీసేస్తారు. ఇక చాలా మంది ఎవరిని అయినా తక్కువ చేసి మాట్లాడే సమయంలో కూడా కూరలో కరివేపాకు అంటారు. అసలు కరివేపాకు గురించి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అలా ఎందుకు అన్నారో మీరే బాధపడతారు. కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు లేకుండా ఎక్కువగా మన తెలుగు ఇళ్ళల్లో చాలా వంటలు పూర్తి కావు కూడా.

రుచితో పాటుగా సువాసన కూడా కరివేపాకు సొంతం. చాలా మంది తినడానికి ఇష్టపడరు. కాని దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఉదయాన్నే కరివేపాకుని నమలడం అనేది మంచి అలవాటు అంటున్నారు. కాస్త చేదుగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది అంటున్నారు.

అసలు ఉదయాన్ని కరివేపాకు తినడం వలన ఉపయోగాలు చూస్తే… రాలిపోతున్న జుట్టుని ఆపేస్తుంది కరివేపాకు. ముందుగా నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగి ఆ తర్వాత కాసేపటికి నాలుగు కరివేపాకుల్ని నోట్లో వేసి నమిలేసి అరగంట పాటు ఏమీ తినకూడదు. కరివేపాకుల్లో విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్ (ఇనుము), కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే… జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

అలాగే పొట్టలో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడంతో. అవి జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయని చెప్తున్నారు. అదే విధంగా మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి. మలబద్ధకం సమస్య చాలా త్వరగా తీరుతుంది. ఉదయం లేవగానే చాలా మందికి బద్ధకంగా, వికారంగాను ఉంటుంది. కరివేపాకులు తింటే ఆ సమస్య ఉండదు. జీర్ణక్రియావ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో… వికారం, వాంతులు అయ్యే పరిస్థితి ఉండదు.

కరివేపాకు తినడంతో శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరిమేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ దాదాపుగా మన శరీరం నుంచి దూరమవుతుంది. కరివేపాకులకూ కంటిచూపుకీ కచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే, కంటి చూపు అంత బాగుంటుంది. స్కూల్ పిల్లలకు కరివేపాకు అనేది చాలా అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news