గుజరాత్‌లో అమానుషం.. మహిళా ఉద్యోగులను నగ్నంగా నిలబెట్టి శారీరక పరీక్షలు..!

-

బుజ్‌లోని ఓ కాలేజీ హాస్టల్‌లో అక్కడి వార్డెన్‌ విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి రుతస్రావ పరిశీలన చేసిన ఘటనను మరువకముందే.. గుజరాత్‌లో మరో అమానుషం చోటుచేసుకుంది. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రెయినీలుగా చేరిన 10 మంది మహిళా క్లర్కులను అక్కడి వైద్యులు ఒక గదిలో నగ్నంగా నిలబెట్టి, శారీరక పరీక్షలు చేశారు. కాగా, ఈ ఘటనపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధిత మహిళలు జరిగిన ఘటనను శుక్రవారం సూరత్‌ మున్సిపల్ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌.. ఈ అమానుష ఘటనపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి, 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీలో మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మాజీ డీన్‌, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సభ్యులుగా ఉన్నారు.

ఇదిలావుంటే, నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి ట్రెయినింగ్‌ పీరియడ్‌ తర్వాత తప్పనిసరి శారీరక పరీక్షలు కొన్ని ఉంటాయని, అయితే తాజా కేసులో మహిళలపట్ల ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగా లేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శారీరక పరీక్షల కోసం ఒకరి తర్వాత ఒకరిని కాకుండా 10 మందిని ఒకేసారి గదిలోకి పిలిచి నిలబెట్టడం కూడా చట్టవిరుద్ధమైన చర్య అని వారు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news