కరోనాతో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి

మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషన్ కరోనా సోకడంతో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న పూల దేవేందర్ రెడ్డి, దామోదర్ లకు కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు ఎస్పీ. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ సభ్యులుగా ఉన్న నందు, సోను, వెంకట్, శారద, అరుణ, నడుమ ఇంకా మావోయిస్టు సీసీ మెంబెర్స్ తదితరులకు కరోనా సోకినట్లు దృవీకరించామని ఆయన స్పష్టం చేశారు.

కరోనా వచ్చిన మావోయిస్టులు స్వచ్చందంగా లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కరోనా ఉండడంతో గిరిజనులతో పెద్ద ఎత్తున సమూహాలు ఏర్పాటు చేయవద్దని, దాని వల్ల వారికి కూడా కరోనా సోకుతుంది అని ఎస్పీ సూచనలు చేశారు. మావోయిస్టుల్లో ఇంకా ఎవరైనా… కరోనా బాధితులుంటే వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కాగా…. కొన్ని రోజుల క్రితమే…హరిభూషన్ ను మావోయిస్టు కేంద్ర పార్టీలోకి తీసుకున్నారు.