హైదరాబాద్: దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద రావుల రంజిత్ లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రావుల తండ్రి కూడా మావోయిస్టేనన్నారు. రంజిత్‌కు చిన్నప్పటి నుంచి విప్లవ భావజాలం ఉండేదని చెప్పారు. 1 నుంచి 6 తరగతి వరకు రంజిత్ మావోయిస్టు జనతన సర్కార్ స్కూల్లో చదివారని తెలిపారు.
పదో తరగతి పూర్తైన తర్వాత రంజిత్ మావోయిస్టుల్లో చేరారని అన్నారు. సాయుధ బలగాలపై జరిగిన నాలుగు దాడుల్లో రంజిత్ పాల్గొన్నారని స్పష్టం చేశారు. 2018లో కసారంలో జరిగిన పేలుడు కేసులో 9 మంది పోలీసు సిబ్బంది చనిపోయినట్లు డీజీపీ పేర్కొన్నారు. 2020లో మైనప్ప ఘటనలో 23 మంది పోలీసులు మృతి చెందినట్లు వెల్లడించారు. 2021 ఏప్రిల్‌లో జీరం ఘటనలో 26 మంది పోలీస్ సిబ్బంది మృతి చెందారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.