NARAPPA : అదరగొట్టేసిన “నారప్ప” ట్రైలర్..

-

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో… వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ “నారప్ప”. ఈ సినిమా లో హీరో వెంకటేష్ మధ్య వయసుడిగా నటిస్తుంటే… ఆయన సరసన ప్రియమణి నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 20 న ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది.

అయితే.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై రిలీజ్‌ చేయడం వెంకటేష్‌ అభిమానులకు అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో ఓటీటీలోనే మూవీని రిలీజ్‌ చేయడానికే ఫిక్స్‌ అయింది.

చిత్ర బృందం. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ వెంకటేష్‌ ఫ్యాన్స్‌ నే కాదు.. సినీ ప్రేక్షలందరినీ కనువిందు చేస్తోంది. వెంకటేష్‌ యాక్షన్‌ సీన్స్‌, ప్రియమణి అద్భుత నటన ఈ ట్రైలర్‌ లో చూడచ్చు. ఈ ట్రైలర్‌ తో నారప్ప మూవీ మరో రేంజ్‌ వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news