ఛత్తీస్‌గఢ్ బీజాపూర్లో జరిగిన కాల్పులపై మావోస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని అందులో పేర్కొన్నారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. హిడ్మా సురక్షితంగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు.
‘‘హిడ్మా సురక్షితంగా ఉన్నాడు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లతో దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రీ పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీనిలో భాగంగానే మాపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలి’’ అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.