మార్చి 05 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

శ్రీరామ మార్చి – 05 – మాఘమాసం – శుక్రవారం.

 

మేష రాశి:ఇష్టపడేవారు దూరమవుతారు !

ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. అనారోగ్యాలు ఏర్పడతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. కుటుంబంతో సమయాన్ని గడపడానికి వీలు లేకుండా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు ఒత్తిడికిలోనై చదువుని నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

పరిహారాలు: సంకట హర గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి ఉండ్రాళ్ళను గణపతి కి నైవేద్యంగా సమర్పించండి.

 

todays horoscope

వృషభ రాశి:ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. స్నేహితులు కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరైన సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి చూపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులను నిర్లక్ష్యం చేసి వాయిదా వేసుకుంటారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల మీ మీద నిందలు పడతాయి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు. బంధువులతో విభేదాలు కలుగుతాయి. తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువుని నిర్లక్ష్యం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.

పరిహారాలు: ఈరోజు భగవద్గీత పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:సంతోషంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులకు మన్ననలు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

 

సింహరాశి:సహాయం చేసేవారు దూరమవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. స్త్రీలకు వస్తు నష్టం జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనికి తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.

పరిహారాలు: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇబ్బందుల నుంచి బయట పడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీ పరీక్షలో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు.వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఆరోగ్య సమస్యలు !

ఈరోజు సంతోషకరంగా లేదు. ఇతరులు మీకు మంచి మాటలు చెప్పి మోసం చేస్తారు. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. స్నేహితులని దూరం చేసుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విశ్రాంతి లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను వదులుకుంటారు.

పరిహారాలు: శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:పిల్లల కోసం కష్ట పడతారు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. పిల్లల కోసం అన్ని రకాలుగా కష్ట పడతారు. డబ్బు ఎక్కువగా సంపాదించడానికి శ్రద్ధ చూపుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి.

పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులను సోమరితనంగా చేయడం వల్ల వాయిదా పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు.

పరిహారాలు: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:బాధలు తీరిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుం.ది వివాహా సంబంధ విషయాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని సాంకేతిక విద్యకు ప్రాధాన్యత నిస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయట పడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహానికి కొనుగోలు చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అనుకున్న పనులను సంతోషంగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలు: ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు మీ కోసం కంటే ఎదుటివారి కోసం బాగా కష్ట పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. పట్టుదలతో చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి.  ధన లాభం కలుగుతుంది. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు

పరిహారాలు: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.