స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

Join Our Community
follow manalokam on social media

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో అవుతున్నాడు. దీంతో మహేశ్ వెనకబడిపోతున్నాడనే ప్రచారం మొదలైంది.

ఎప్పుడూ ఏడాదికి ఒక సినిమా అన్నట్లు ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా 5 సినిమాలు చేస్తున్నాడు. ‘వకీల్‌సాబ్‌’తో పాటు క్రిష్‌తో పీరియాడికల్ డ్రామా, సాగర్.కె.చంద్ర డైరెక్షన్‌లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నాడు. అలాగే హరీశ్ శంకర్‌, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

ప్రభాస్ ‘సాహో’ తర్వాత చాలా మారిపోయాడు. భారీ సినిమా అంటూ రెండుమూడేళ్లు తీసుకున్న ప్రభాస్, ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలకి సైన్ చేశాడు. ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్’, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. అలాగే నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో ఒక సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాకి కమిట్ అయ్యాడు.

‘ట్రిపుల్‌ ఆర్’ స్టార్లు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కొంచెం స్పీడ్‌గానే ఆలోచిస్తున్నారు. తారక్ ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమాకి సైన్ చేశాడు. అలాగే ప్రశాంత్‌ నీల్‌తో ఒక మూవీ చెయ్యబోతున్నాడు. రామ్ చరణ్ శంకర్‌తో పాన్ ఇండియన్ మూవీ అనౌన్స్ చేశాడు. అల్లు అర్జున్ అయితే ‘పుష్ప’ కంప్లీట్‌కాకముందే కొరటాల శివ సినిమాకి ఓకే చెప్పాడు.

టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా స్పీడ్‌గా సినిమాలు చేస్తోంటే మహేశ్ బాబు మాత్రం వన్‌ బై వన్ అన్నట్లుగానే ముందుకెళ్తున్నాడు. మహేశ్ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమా మాత్రమే చేస్తున్నాడు. రాజమౌళితో సినిమా ఉందనే అనౌన్స్‌మెంట్‌ వచ్చినా, ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు సెట్స్‌కి వెళ్తుంది అన్నది క్లారిటీ లేదు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...