క్వారంటెన్ సెంటర్ లో కూడా వారి తీరు, చేష్టలు అనుమానాస్పదం.. కావాలనే ఇలా చేస్తున్నారా..?

-

దేశ రాజధాని ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్చందంగా వచ్చి వైద్యానికి సహకరించాలని ప్రభుత్వాలు కోరుతున్నప్పటికి వారు మాత్రం ముందుకు రాకుండా ఇటు ప్రభుత్వాలకు, అటు ప్రజలకు పెద్ద సమస్య గా మారారు. వారు ప్రవర్తిస్తున్న తీరు, వారిలో కొంత మంది చేష్టలు నేడు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సికింద్రాబాద్ పార్సీ గుట్టలో ఆరుగురు మర్కాజ్ యాత్రికులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజులు గా వారు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని, అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదం గా ఉందని సమాచారం అందటంతో రంగం లోకి దిగిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఐదుగురు పారిపోగా ఒక వ్యక్తి మాత్రం పోలీసులకు చిక్కాడు. అయితే అతని ప్రవర్తన, కొన్ని చేష్టలు పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి.

ఆ వ్యక్తి జనసంచారం ఎక్కువ గా ఉన్న చోట ఉద్దేశ పూర్వకంగా రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న పలు వాహనాల పై చేతులు వేసి నిలబడిన తీరు, పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత కూడా అతను ఏ మాత్రం బెదరక అక్కడ ఉన్న పలు వాహనాలను చేతితో కావాలని తాకిన విధానం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇది పక్కన పెడితే క్వారంటెన్ సెంటర్ లో కూడా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన కొందరు తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్వారాంటెన్ సెంటర్ లో వీరు మాస్క్ లు ధరించకపోగా, సామూహిక ప్రార్థనలు చేయడం తో పాటు, అక్కడ ఉన్న మిగతా వారితో కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పడం వంటివి పలు అనుమానాలకు తావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news