రివ్యూ- మ‌రో ప్ర‌స్థానం

-

రీల్‌టైమ్ రియ‌ల్‌టైమ్, వ‌న్‌షాట్ ఫిల్మ్ గా ప్ర‌చారం చేసుకొని సినిమాపై క్యూరియాసిటీని పెంచిన త‌నీష్ మ‌రోప్ర‌స్థానం సినిమా శుక్ర‌వారం రోజున ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. హిమాల‌య స్టూడియో మాన్ష‌న్స్, ఉద‌య్ కిరణ్ స‌మ‌ర్ప‌ణ‌లో మిర్త్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది. జానీ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌చారం చేసుకున్న విధంగా ప్ర‌జాద‌ర‌ణ పొందిందా లేదా అన్న‌ది తెలుసుకుందాం.

క‌థ‌:

క‌థ ముంబై లో ప్రారంభం అవుతుంది. విల‌న్ క‌బీర్ దుహాన్ సింగ్ అత‌ని గ్యాంగ్ క‌లిసి ముంబైలో వ‌ర‌స నేరాల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ గ్యాంగ్‌లో శివ ( త‌నీష్‌) ఓ స‌భ్యుడు. అయితే, ఒక‌రోజు నైని (అర్చ‌నా సింగ్‌) అనే అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆ అమ్మాయి కూడా శివ‌ను ఇష్ట‌ప‌డుతుంది. అయితే, గ్యాంగ్‌స్ట‌ర్ వృత్తిలో ఉన్న శివ ఆ వృత్తిని వ‌దిలేద్దామ‌ని అనుకుంటాడు. అదే స‌మ‌యంలో శివ త‌న జీవితంలో అతిపెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటాడు. దీంతో శివ విల‌న్ నేర‌సామ్రాజ్యాన్ని ప్ర‌పంచానికి చూపించాల‌ని అనుకుంటాడు. గ్యాంగ్ చేస్తున్న నేరాల‌ను సీక్రెట్ కెమేరాలో చిత్రీక‌రిస్తుంటాడు. విల‌న్ చేయ‌బోయే ఓ పెద్ద బాంబ్ బ్లాస్ట్ ను ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు శివ‌. శివ త‌న జీవితంలో ఎదురైన ఆ పెద్ద ఇబ్బంది ఎంటి? బాంబ్ బ్లాస్ట్‌ను ఆప‌గ‌లిగారా లేదా? ముస్కాన్ సేథి పాత్ర ఏంటి? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

 

విశ్లేష‌ణ‌:

త‌నీష్ త‌న గ‌త చిత్రాల‌కు పూర్తిగా ఆపోజిట్‌గా ఉండే పాత్ర‌ను ఎంపిక చేసుకొని పెద్ద సాహ‌సం చేశారు. త‌నీష్ కేరీర్‌లోనే ఇది ఓ ఢిఫ‌రెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి ఎమోష‌న‌ల్ కిల్ల‌ర్ క్యారెక్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌నీష్ చేయ‌లేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టికల్ గా షూటింగ్ చేయడం చాలా కష్టం. ప్రతి సీన్ ఒక సీక్వెన్స్ లో వెళ్లాలి. సింగిల్ టేక్ లో ఓకే అవ్వాలి. ఈ సీన్ మేకింగ్ ప్రాక్టీస్ లో దర్శకుడు జాని సక్సెస్ అయ్యారు. మరో ప్రస్థానం సినిమా ప్రారంభం ఎండ్ దాకా..ఒక ఫ్లోలో సీన్స్ అన్నీ సాగుతుంటాయి.

ఈ మూవీలో హీరోకి ఎదురైన ట్రాజెడీ త‌రువాత క‌థ పూర్తిగా మారిపోతుంది. అక్క‌డి నుంచి సినిమా మ‌రింత సీరియ‌స్‌గా నెక్ట్స్ ఏం జ‌రుగుతుంది అనే క్యూరియాసిటీకి క‌లిగిస్తూ సాగుతుంది. క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ అంతే సీరియ‌స్‌గా సాగ‌డం సినిమాకు ప్ల‌స్ పాయింట్‌. అయితే, సినిమా అన్న త‌రువాత కాస్తంత కామెడీ ట్రాక్ కూడా ఉండాలి. కానీ, ఈ మూవీలో ఆ కామెడీ ట్రాక్ క‌నిపంచ‌దు. పైగా వ‌న్ షాట్ ఫిల్మ్ కాబ‌ట్టి కామెడీని ఊహించ‌డం క‌ష్ట‌మే. అయితే, హీరోయ‌న్ ముస్కాన్ సేథీ గ్లామ‌ర్ యాడ్ తో కాస్త రిలీఫ్ ఇచ్చంది. విల‌న్‌గా క‌బీర్ సింగ్ సెటిల్డ్‌గా ప‌ర్మార్మ్ చేశాడు.

సాంకేతిక వ‌ర్గం ప‌నీతీరు:

సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి క్రాఫ్ట్ లు మరో ప్రస్థానం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. ఎంఎన్ బాల సినిమాటోగ్రఫీ, సునీల్ కశ్యప్ సంగీతం సినిమాకు బలన్నిచ్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కొంత ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే కథ ఫ్లోకు అడ్డువస్తుందని దర్శకుడు అలాంటి ఆలోచన చేయలేదనిపిస్తుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన మరో ప్రస్థానం సినిమా కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ ను మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

ఫ్లస్ పాయింట్స్

తనీష్ యాక్టింగ్

వన్ షాట్ మేకింగ్

సినిమాటోగ్రఫీ

డైరెక్షన్

మైనస్ పాయింట్స్

ఎంటర్ టైన్ మెంట్ తగ్గడం

రేటింగ్‌: 3/5

Read more RELATED
Recommended to you

Latest news