కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డే మరియు టి 20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోనున్నట్లు   సమాచారం అందుతోంది. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ రాజీనామా అనంతరం…. భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ను కెప్టెన్ గా  నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తన బ్యాటింగ్ పర్ఫామెన్స్ పైన దృష్టి పెట్టేందుకు… కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు  కోనున్నట్లు  సమాచారం. గత ఏడాది కాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తున్న విరాట్ కోహ్లీ… ఈ మేరకే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్ డే మరియు టి 20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… రోహిత్ శర్మ ను కచ్చితంగా కెప్టెన్ చేస్తారని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.