మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్‌.. బై నౌ, పే లేటర్‌ స్కీం..

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి దేశంలోని కార్ల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందిస్తోంది. కరోనా వల్ల ఈఎంఐలు కట్టలేని స్థితిలో ఉన్నవారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. బై నౌ, పే లేటర్‌ పేరిట ఆ ఆఫర్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెట్టింది. దీంతో వినియోగదారులు కారును కొన్న 2 నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు.

maruti suzuki offers buy now pay later scheme for new car buyers

కాగా ఈ ఆఫర్‌కు గాను మారుతీ సుజుకి.. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని వల్ల కొత్తగా మారుతి సుజుకి కార్లను కొనేవారు ఇప్పటి నుంచి 2 తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు. 2 నెలల వరకు ఈఎంఐ డిఫర్‌మెంట్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్‌లెట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందని ఆ సంస్థ తెలియజేసింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్‌పైనే ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్‌ 30వ తేదీతో ఈ ఆఫర్‌కు గడువు ముగుస్తుందని అన్నారు.

తాము ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌ వల్ల కారు కొనాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని, వెను వెంటనే ఈఎంఐలు కట్టే భారం తప్పుతుందని మారుతీ సుజుకి, చోళమండలం కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో నగదుకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా కార్లను కొనేవారికి ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.