ఆగస్టు వరకూ థియోటర్స్ ఓపెన్ కావా …?

-

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సినీ ఇండస్ట్రీ మూతబడిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, సీరియల్స్ షూటింగ్స్ జరిగి సుమారు రెండు నెలలకు పైగానే అయ్యింది. ప్రస్తుతం 4.0 లాక్ డౌన్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. అంతేకాదు మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు కూడా ఉంండే అవకాశముందని జూన్ నెలాఖరు వరకు కంటిన్యూ చేసినా షాకవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు.

 

ఇదే గనక జరిగితే మాత్రం టాలీవుడ్‌కు భారీ నష్టమే అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ కొన్ని వందల కోట్లు నష్టపోయింది. ఇంకా లాక్ డౌన్‌కు పొడిగింపు ఉన్నా.. లేదా షూటింగ్, థియేటర్స్‌కు సడలింపులు లేకపోతే మాత్రం ఈ దెబ్బ నుంచి టాలీవుడ్ కోలుకోవాలంటే కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుందట.

అందుకే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంతో కేవలం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల‌కు మాత్రమే అనుమతి లభించింది. కాని ఇమా దీనిపై అధికారికమైన ప్రకటన రాలేదు.

అయితే సినిమా రిలీజ్‌లు మాత్రం ఇప్పట్లో కుదరదని చెప్పినట్టు తెలుస్తునంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ వరకు థియేటర్లను ఓపెన్ చెసే అవకాశాలు లేవనే అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో థియేటర్స్ ఓపెన్ చేస్తే కేసులు మరిన్ని కేసులు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారట. జూన్, జులై నెలల్లో కాస్త కరోనా కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అంచనా. దీన్ని బట్టి చూస్తుంటే సినిమాలు రిలీజ్ కావాలంటే ఇంకా ఆగస్టు వరకు ఆగాల్సిందే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news