హిందూ మహా సముద్రంలో భారీగా బలగాల మోహరింపు..!

-

చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత నౌకాదళం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశానికి గట్టి సందేశం పంపేలా.. హిందూ మహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్​) వెంబడి భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్టు సమాచారం. ఈ మార్పులను చైనాకు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది.

Ship
Ship

చైనా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా దేశ శక్తిని ప్రదర్శించేందుకు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం కలిసిగట్టుగా కృషిచేస్తున్నాయి. వీటితో పాటు దౌత్య, ఆర్థిక చర్యలతో తూర్పు లద్ధాఖ్​లో చైనా దురాక్రమణను అడ్డుకుంటోంది భారత్​.జూన్​ 15న గల్వాన్​ లోయ ఘటనతో ఐఓఆర్​లో బలగాలను మోహరించడం మొదలుపెట్టింది నౌకాదళం. దీనితో పాటు నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు కూడా సరిహద్దులో గస్తీ కాస్తున్నాయి.తాజా పరిణామాలను గుర్తించినప్పటికీ.. చైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, బలగాలను మోహరించలేదని అధికారవర్గాల సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై అమెరికాతో నెలకొన్న వివాదం ఇందుకో ఓ కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ నౌకలను మోహరించింది చైనా.

Read more RELATED
Recommended to you

Latest news