టెర్రరిజానికి అడ్డా అయిన పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఆ దేశంలోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ బాంబ్ బ్లాస్ట్ అవ్వగా 16 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని అక్కడి జాతీయ మీడియా పేర్కొంది. క్వెట్టా నుంచి పెషావర్‌కు రైలు వెళ్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు కారణంగా 30 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆత్మాహుతి దాడిగా ఈ ఘటనను అనుమానిస్తున్నారు.ఇది ఆత్మాహుతి దాడినా? లేక బాంబ్ బ్లాస్టా అనే దానిపై ఇప్పుడే నిర్థారణకు రాలేమని అధికారులు తేల్చారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అనుమానిస్తున్నారు.