ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు ఏకంగా రైల్వేస్టేషన్లో గల హైటెన్షన్ కరెంట్ తీగలను ముట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అత్తిలి రైల్వేస్టేషన్లో తమిళనాడుకు చెందిన యువకుడు కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పాడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడకు చేరుకునే లోపే ఆ యువకుడు కరెంటు వైర్లను తాకి కిందపడి చనిపోయినట్లు తెలిసింది. అయితే, ఆ యువకుడి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.