Breaking: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా చెలరేగిన మంటలు

-

దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయంలోని టోయింగ్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ విషయంపై విమాన కార్గో విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోందన్నారు.

ఢిల్లీ విమానాశ్రయం
ఢిల్లీ విమానాశ్రయం

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:25 గంటలకు కార్గో బేలో విమానాల పార్కింగ్ కోసం వినియోగించే.. టోయింగ్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేసింది. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. అయితే ఈ టోయింగ్ వాహనం పలు విమానాలకు దగ్గర్లో ఉంది. మంటలు త్వరగా అదుపులోకి తీసుకురావడంతో భారీ ముప్పు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news