ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా బదిలీలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నెలాఖరులోగా సుమారు 10వేల మందిని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రభుత్వం. ఒకే చోట పని చేస్తూ… ఐదేళ్లు దాటిన వారు తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధన బైబిల్ తో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది అలాగే నాలుగో తరగతి ఉద్యోగులను బదిలీ చేయనుంది.

బోధన్ ఆస్పత్రుల్లో కొందరు వైద్యులు గత 25 సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతులు వచ్చిన నిరాకరిస్తూ అక్కడే పని చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరందరూ బదిలీ కానున్నారు. బదిలీకి అర్హత కలిగిన వారి నుంచి 20 ప్రదేశాలను కోరుకునేలా ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మరోవైపు ఈ జాబితా నుంచి తమ వారి పేర్లను తప్పించాలని ప్రభుత్వ పెద్దలనుంచి ఒత్తులు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ ద్వారా చేపట్టాలని ఉత్తర్వులు ఉన్నందున తాము ఏమీ చేయలేమని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 39 వేల మంది ఉద్యోగులను ఏకంగా 25 శాతం మంది బదిలీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news