షాకింగ్ : వ‌రుస‌గా మూడో రోజు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాక్ కు గురి చేస్తున్నాయి. వ‌రుస‌గా మూడు రోజు కూడా బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. ఇప్ప‌టికే రూ. 53 వేలు క్రాస్ చేసిన గోల్డ్ ధ‌ర .. తాజా గా రూ. 54 వేల మార్క్ ను అందుకుంది. అలాగే వెండి కూడా గ‌రిష్ట స్థాయికి చేరుకుంది. గ‌త వారం రోజుల్లో బంగారం ధ‌ర రూ. 1,700 వ‌ర‌కు పెరిగింది. అలాగే వెండి ధ‌రలు గ‌త వారం రోజుల్లో రూ. 3,700 వ‌ర‌కు పెరిగింది.

ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య వార్ త‌గ్గ‌క‌పోవ‌డం, పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డం తో పాటు పెళ్లీల సీజ‌న్ వ‌ల్ల బంగారం, వెండి ధ‌ర‌ల‌కు రెక్క‌లేచ్చాయి. ఇప్పటికే గ‌రిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధ‌ర‌లు.. మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ధ‌ర‌లు ఇంకా.. పెరిగితే సామాన్య‌లు బంగారం, వెండి కొనుగోలు దూరం కావాల్సిందే ఇక‌. కాగ నేటి మార్పుల‌తో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో 10 గ్రాముల 22 క్య‌రెట్ల‌ బంగారం ధ‌ర రూ. 49,550 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 54,060 కి చేరుకుంది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 74,400 కు చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌ న‌గ‌రంలో 10 గ్రాముల 22 క్య‌రెట్ల‌ బంగారం ధ‌ర రూ. 49,550 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 54,060 కి చేరుకుంది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 74,400 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news