మే 23 రాశి ఫలాలు..ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

-

మే 23 సోమవారం దిన ఫలాలు..ఏ రాశి వారికి అదృష్టం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…

మేషం: ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. సన్నిహితులు, బంధువులు మీకు సహాయంగా నిలుస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. సమాజంలో పేరున్న వారితో పరిచయాలు.వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి..దైవదర్శనాలు చేస్తారు.

వృషభం: కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి..శుభ కార్యాలు జరుగుతాయి.విందు వినోదాల్లో పాల్గొంటారు.. ఈరోజు చాలా మంచి రోజు.

మిథునం : మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి..కొత్త పనులు మొదలు పెట్టక పోవడం మంచిది..ఈరోజు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి..రుణ ప్రయత్నాలు విఫలం అవుతాయి.ఈ రోజు అంత నిరాశలో ఉంటారు..దైవదర్శనాలు , తూర్పు దిక్కు ప్రయాణాలు చేయడం మంచిది.

సింహం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి..ఈరోజు కొత్తగా చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

కన్య: సమస్యల నుండి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..శుభ కార్యాలు చేస్తారు..ఆత్మీయుల తో వింధు, వినోదాల్లో పాల్గొంటారు..

తుల: మిత్రులతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం..కాస్త ఓపికగా ఉండాలి.ఈరోజు చికాకులు చుట్టి ముట్టాయి.ఈరోజు అంతగా బాగాలేదు.

వృశ్చికం: చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు..ఇంట్లో చికాకులు, పనులలో జాప్యం,దైవదర్శనాలు చేయాలి.ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు..పదోన్నతలు పెరుగుతాయి.. ఇంటా, బయట ఆనందంగా ఉంటారు.

మకరం: కుటుంబసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొన్ని సమస్యలతో సాగుతాయి..అధికారులతో మాట పట్టింపులుంటాయి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం: కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఆస్తి లాభం. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..ఈరోజు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అధికారులను ఇంప్రెస్ చేయడానికి మంచి అవకాశం.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు..సన్నిహితులతో తగాదాలు, కుటుంబంలో చికాకులు, విలువైన వస్తువులను జాగ్రత్రగా ఉంచుకోవడం మంచిది..ఈరోజు అంత మంచి రోజు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news