ఎర్రన్నలంటే ఒకప్పుడు జనాల్లో విపరీతమైన నమ్మకం ఉండేది! పేదవాడికి ఆపదవస్తే ముందుగా అక్కడ వాలిపోయేది కమ్యునిస్టులే అని పేరు ఉండేది! అయితే కాలం మారింది.. కామ్రెడ్ లూ మారిపోయారు! ప్రస్తుతం వారు కూడా పసుపు రంగు అంటించేసుకుంటున్నారు.. ఫలితంగా ఎర్ర రంగుకు రంగు మార్చేస్తున్నారు! ఈ పరిస్థితుల్లో ఎర్రన్నాలు గీతం యూనివర్శిటీ గురించి తెగ ఫీలయిపోతున్నారు.
అవును… విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమిత ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 44 ఎకరాలవరకూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని.. వాటిని సర్వే నెంబర్లతో సహా వివరించారు ఆర్డీవో. అయితే… దీనికి పరిపూర్ణమైన రాజకీయ రంగు పులిమేశారు టీడీపీ నేతలు! సరే.. వారి కంటే తప్పదు.. ఎందుకంటే గీతం చైర్మన్ బాలకృఇష్ణ అల్లుడు, టీడీపీ ఎంపీ అభ్యర్ధి! కానీ ఎర్ర్రన్నలకెందుకు ఉక్కబోత!
గీతం వర్శిటీ భూముల విషయంలో అది తమ భూమే అని ఇప్పటివరకూ గీతం యాజమాన్యం స్పందించిన దాఖళాలు లేవు. అయినా కూడా ఎర్రన్నలు మైకందుకున్నారు.. అర్థరాత్రి వెళ్లి నిర్మాణాలను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది.. జగన్ విధ్వంస పాలన చేస్తున్నారు.. ప్రభుత్వ భూముల విషయంలో శ్వేతపత్రం విడుదలచేయాలి అని చెప్పుకొచ్చారు నారాయణ!
ఒకప్పుడు పేదల ఇళ్లకు, నిరుపేదల జీవితానికి సమస్యలు వచ్చినప్పుడు ముందున్న ఎర్రన్నలు ఇలా కోట్లకు పడగలెత్తిన యాజమాన్యం మీద “విద్యాసంస్థలు” అన్నే పేరుచెప్పి జాలి చూపాల్సిన అవసరం ఏమిటి? గీతం యాజమాన్యం చేసింది తప్పు అని చెప్పాల్సిన ఎర్రన్నాలు ఇలా.. తప్పును తప్పు అని చెప్పిన ప్రభుత్వ చర్యలను తప్పుపట్టడం ఏమిటో?