రిలయన్స్ తో ఎంవోయూ చేసుకున్నాం అని తెలిపిన సీఎం చంద్రబాబు.. ప్రపంచంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వారు ఇండియా కి చెందిన వారే. వన్ ఫ్యామిలి వన్ ఎంట్రపెన్యూర్ అనేది మా లక్ష్యం అని స్పష్టం చేసారు. మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి, టిజి భరత్ లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం చంద్రబాబు.. అతి స్వల్పకాలంలో ఈ ఎంవోయూ కోసం లోకేష్ బాగా పనిచేశారు అని తెలిపారు.
ఇక లోకేష్ కు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చినట్లు తెలిపిన సీఎం.. ఆ దిశగా ఆయన ముందుకు వెళుతున్నారు అని అన్నారు.మంత్రి గోట్టిపాటి రవి కూడా ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బాగా సహకరించారు. మంత్రి టిజి భరత్ ఉన్నత విద్యావంతుడు చాలా మంచి వర్కు చేస్తున్నారు. ఈ ముగ్గురు చాలా బాగా పనిచేస్తున్నారు. మావైపు ఫుల్ స్వింగ్ లో ఉన్నాం.. అటు రిలయన్స్ కూడా స్పీడ్ గా ఎక్సిక్యూట్ చేస్తారనే పేరు ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లోనే కార్యరూపం లోకి తీసుకురావాలి అని చంద్రబాబు పేర్కొనారు.