మేయర్, డిప్యూటీ మేయర్ గా మహిళలకే ఛాన్స్..ఎవరంటే ?

Join Our Community
follow manalokam on social media

జీహెచ్‌ఎంసీ నూతన పాలక మండలి ఈరోజు కొలువు తీరనుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకొనున్నారు కొత్త కార్పొరేటర్‌లు. బీజేపీ, ఎంఐఎం పోటీ చేయకుంటే టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది కానీ బీజేపీ మాత్రం పోటీ చేయాలని డిసైడ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లకు డిసెంబర్‌ లో ఎన్నిక నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. కొత్త కార్పొరేటర్లు గెలిచినా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. నేటితో పాత పాలకవర్గం కాలం పూర్తయి…నూతన పాలక వర్గం కొలువుదీరనుంది.

ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ఒకరు చనిపోవడంతో మొత్తం 149 మంది కార్పొరేటర్లు ఒక్కోక్కరుగా ప్రమాణ స్వీకారం చేచనున్నారు. అయితే టీఆర్ఎస్ తమ మేయర్ అభ్యర్ధిగా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ? అలానే డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీ లతా శోభన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక బీజేపీ నుండి రాధా ధీరజ్ రెడ్డి, రావిచారిలు బరిలో ఉండనున్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...