కలెక్టర్ లంచం కేసులో ఇంకా సాగుతోన్న సోదాలు.. వెలుగులోకి కీలక అంశాలు !

-

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్ లను అరెస్ట్ చేసి నిన్ననే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ను కూడా ఏసీబీ కార్యాలయానికి తీసుకు రానున్నారు. అరెస్ట్ చేసి ఐదుగురు నిందితులను నేడు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్నారు.

112 ఎకరాల విస్తీర్ణంలో భూమి NOC ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు, ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్ చేశారు. మొదటగా రెండు విడతల్లో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలు లంచం తీసుకున్న నగేష్ మిగిలిన 72 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్ కి సేల్ అగ్రిమెంట్ చేయించారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం బాధితుడు నుండి 8 ఖాళీ చెక్కులు తీసుకున్నారు కలెక్టర్ నగేష్. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగేష్ ఇంట్లో కీలకమైన అగ్రిమెంట్ సెల్ డాక్యుమెంట్స్, చెక్స్ స్వాధీనం ఈరోజు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనుంది ఏసీబీ.

Read more RELATED
Recommended to you

Latest news