ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం పై ఇప్పుడు చాలా వరకు అంచనాలు ఉన్నాయి. రాజకీయంగా జనసేన పార్టీని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేదానిపై చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తారు అని జనసేన కార్యకర్తల గాని జనసేన నాయకులు గానీ పెద్దగా ఊహించలేదు. ఆయన తెలుగుదేశం రాజకీయం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు గత కొంతకాలంగా అంచనా వేసిన అనూహ్యంగా ఆయన బీజేపీ తో ప్రయాణం చేయడానికి చాలా వరకూ ఆసక్తి చూపించారు. అయితే ఏపీలో బీజేపీకి ఉన్న రాజకీయ భవిష్యత్తు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మరి ఏ వ్యూహంతో పవన్ కళ్యాణ్ బిజెపికి జై కొట్టారు అనేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున అసహనం అనేది పెరిగిపోతోంది. ఏదైనా నిరసన చేయడానికి ముందుకు రావాలి అని భావించినా సరే ఎక్కడ బీజేపీని కలుపుకో వాలో అని చాలామంది జనసేన పార్టీ నేతలు వెనక్కి తగ్గుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని భావించినా సరే పరిస్థితులు అందుకు అనుగుణంగా జనసేన పార్టీకి లేవు అని చెప్పాలి. ఉదాహరణకు రాజధాని ఉద్యమం సమయంలో పవన్ కళ్యాణ్ బెంజ్ సర్కిల్ నుంచి అమరావతి ప్రాంతం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు.
దీనితో పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గి ఆ తర్వాత రాజధాని విషయంలో సైలెంట్ గా ఆవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దగా రాజధానికి సంబంధించి ఏ వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం ఏదీ లేదు. ఇటీవల పత్రికా ప్రకటనలు విడుదల చేయడమే మినహా రాజధాని ప్రాంతానికి వచ్చి సొంతగా పోరాడింది కూడా ఏమీ లేదు అని చెప్పాలి. రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరిపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా గాజువాకలో పోటీచేస్తే ఓడించారు కాబట్టే అమరావతి కి మద్దతు గా మాట్లాడుతున్నారు అని పవన్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు జాగ్రత్తగా స్పందించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఇక ఇప్పుడు జనసేన నేతలు కూడా చాలావరకు అసహనం గా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. స్వేచ్ఛగా తామేమీ చేయలేకపోతున్నామని భావిస్తున్న చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి పోవాలి అని భావిస్తున్నారు. వైసీపీ విషయంలో చాలామంది జనసేన పార్టీ నేతలు అసహనం గా ఉన్నారు. వైసీపీపై పోరాడాలి అంటే జనసేన లో ఉంటే సాధ్యం కాదు అనే భావనకు చాలామంది జనసేన నేతలు వచ్చేశారు. దీనితోనే ఇప్పుడు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జై కొట్టే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ నేతలు గానీ చాలా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన సరే తెలుగుదేశం పార్టీ నుంచి కాస్త మంచి స్పందనే ఉంది. కానీ జనసేన లో మాత్రం అలాంటి వాతావరణం లేదు అని చెప్పాలి. ఎవరినైనా కార్యకర్తలను అరెస్టు చేసినా సరే పార్టీ అధిష్టానం నుంచి స్పందన వస్తుంది అని భావించడం కూడా తప్పే అని జనసేన కార్యకర్తలు కూడా అదే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు చాలా వరకు కూడా జనసేన నేతలు పార్టీ మారటమే మంచిది అనే భావన లో ఉన్నారట.