ఒక్క తెలంగాణా రాష్ట్రానికే కాదు దేశానికే మేడారం జాతర అనేది ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర దీని సొంతం. దట్టమైన అడవులలో, కొండకోనలు మధ్య జరిగే ఎంతో ప్రతిష్టాత్మక వేడుక ఇది. అతిపెద్ద గిరిజన పండుగ. మొక్కులు చెల్లించుకోవడానికి గానూ లక్షలాది మంది భక్తులు ఆ మూడు రోజులు తరలి వస్తూ ఉంటారు.
ఈ తెలంగాణా కుంభమేళా రేపటి నుంచి మొదలుకానుంది. గిరిజన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సోమవారం ఉదయం పెళ్లి కొడుకు పగిడిద్దరాజును సమీప బర్లగుట్టపై నుంచి గుడికి తరలించారు. పగిడిద్ద రాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తొట్టివాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్లి గద్దెలపై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు.
Night View of #Medaram. #MedaramJathara#SammakkaSaralammaaJathara #Telangana #TelanganaTourism #Hyderabad pic.twitter.com/oQJeRZFXr0
— V Srinivas Goud (@VSrinivasGoud) February 3, 2020
అనంతరం పగిడిద్ద రాజు పడగలతో డోలీల చప్పుల్లతో కాలి నడకన మేడారానికి బయల్దేరి వెళ్ళారు. రేపు అంటే బుధవారం… సారలమ్మ, గోవిందరాజుల రాకతో ఈ జాతర మొదలవుతుంది. రేపు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఎల్లుండి సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో జరగనుంది.