మెడిటేషన్ చేస్తే ప్రశాంతత చేకూరుతుందని, కోపం, ఇతర మానసిక సమస్యలు తగ్గిపోతాయని చిన్నప్పటి నుంచి స్కూల్ లో టీచర్ నుంచి పక్కింటి అంకుల్ వరకు అందరూ ఏదోక సందర్భంలో చెప్తూనే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా దాని గురించి కాస్త అవగాహన ఉంటే చాలు క్లాసులు పీకేస్తూ ఉంటారు. కాని అది కేవలం ప్రచారమే గాని మెడిటేషన్ వలన ఉపయోగం లేదంటున్నారు బ్రిటన్ వాళ్ళు.
ప్రశాంతత రావడం, కోపం తగ్గడం అన్ని అబద్దాలే అంటున్నారు, వాస్తవం లేదని బ్రిటన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ధ్యానం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉంటాయనే మాటను నమ్మొద్దని సూచిస్తున్నారు. ధ్యానం వల్ల సత్ప్రవర్తన, ప్రశాంతత చేకూరుతాయా అనే అంశం తీసుకుని వారు 20 అధ్యయనాలను చేసారు. ఆ తర్వాత అధ్యయన ఫలితాలను వారు సమీక్షించి,
ధ్యానం చేసిన బృందాన్ని, చేయని బృందాన్ని పరీక్షించి చూసి వారు ఫలితాలను ప్రకటించారు. ధ్యానం వలన సానుకూల దృక్పథం ఏర్పడడం అనేది అపోహ మాత్రమేనని స్పష్టంగా అర్ధమయ్యే విధంగా చెప్పేశారు. మెడిటేషన్ చేసిన కొద్ది సేపు అలాంటి మానసిక స్థితి ఉంటే ఉండొచ్చు గాని, దైనందిన కార్యక్రమాల్లో మాత్రం వారు తమ కోపాన్ని, దూకుడును అదుపు చేసుకోలేకపోతున్నారని వివరించి చెప్పారు. టీచర్, పక్కింటి అంకుల్ చెప్తే చేయండి గాని ఏదో ఆశ మాత్రం ధ్యానం మీద పెట్టుకోకండి.