నెవర్‌ గివ్‌ ఆప్‌.. గాయమైనా మరోసారి సత్తాచాటిన మీరాబాయి చాను..

-

భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన ప్రతిభ చాటుకుంది. ఒలింపిక్స్ లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన చాను తాజాగా ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించింది. మణికట్టుకు గాయం అయినా లెక్క చేయకుండా బరువులు ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తంగా 200 కేజీలు ఎత్తిన మీరాబాయి..సిల్వర్ను దక్కించుకుంది. అగ్రస్థానంలో నిలిచిన చైనా వెయిట్ లిఫ్టర్ జియాంగ్ హూహువా 206 కేజీలతో గోల్డ్ మెడల్ను సాధించింది మీరాబాయి చాను.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో పోటీ పడింది. ఇందులో భాగంగా ఫైనల్లో స్నాచ్‌ విభాగంలో 87 కేజీలు ఎత్తింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 113 కేజీల బరువు ఎత్తడంతో మొత్తం 200 కేజీలకు చేరింది. అయితే చైనా లిఫ్టర్ జియాంగ్ హూహువా మీరా కంటే 6 కేజీలు ఎక్కువ ఎత్తడంతో గోల్డ్ మిస్ అయింది. అటు చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహువా 198 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version