దాని గురించే ఐటీ రైడ్స్‌.. స్పందించిన దేవినేని అవినాష్..

-

ఐటీ అధికారులు వైసీపీ నేత, విజయవాడ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. నేడు సాయంత్రం ఐటీ సోదాలు ముగిశాయి.. ఈ ఐటీ సోదాలపై దేవినేని అవినాష్ స్పందించారు. తన తండ్రి దేవినేని నెహ్రూ 1972 నుంచి చనిపోయే వరకు రాజకీయాల్లో ఉన్నారని.. దాదాపు ఆరు ఎన్నికల్లో పోటీచేస్తే ఐదుసార్లు గెలిచారన్నారు. తాను రెండు ఎన్నికల్లో పోటీచేశానన్నారు. అయితే మంగళవారం జరిగిన ఐటీ సోదాలు మామూలుగానే జరిగాయని క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబం, రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు అవినాష్. ఉంటే రాజకీయాల్లో ఉండాలి.. లేకపోతే ఎవరి పని వారే చేసుకోవాలని తన తండ్రి నెహ్రూ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. విజయవాడలో 50 ఏళ్లుగా ఒక వ్యవస్థగా ముందుకు వెళుతున్నామని.. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు అవినాష్.

నెహ్రూ ఇచ్చిన భూమి.. హైదరాబాద్‌లో స్థలం డెవలప్‌మెంట్‌కు ఇచ్చామన్నారు. ఆ విషయంలోనే ఐటీ సోదాలు జరిగాయని తెలిపారు అవినాష్. ఐటీ అధికారులకు సహకరించామని.. వారు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఏ డాక్యుమెంట్లు తన దగ్గర నుంచి తీసుకెళ్లలేదని.. హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లారన్న ప్రచారంలో నిజం లేదన్నారు అవినాష్. ఐటీ అధికారులు వచ్చారు విచారణ చేసి వెళ్లిపోయారన్నారు అవినాష్. ప్రతిపక్షం టీడీపీ తాను రాజకీయంగా ఎదుగుతున్నామనే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కావడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు అవినాష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version