ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ నెల 14న జన సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు జగన్ సర్కార్ లైన్ క్లియర్ చేసింది. ఇప్పటి వరకు ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేని జగన్ సర్కార్.. తాజా గా పవన్ బహిరంగ సభకు అనుమతులు ఇచ్చింది. కాగ గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జన సేనకు.. వైసీపీ ప్రభుత్వానికి మధ్య వివాదం చోటు చేసుకుంది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేసింది. కానీ బహిరంగ సభ నిర్వహించడానికి జగన్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పలు చోట్ల జన సేన సైనికులు ఆందోళనలు కూడా నిర్వహించారు.
దీంతో జగన్ ప్రభుత్వం దిగివచ్చింది. పవన్ బహిరంగ సభకు వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మార్చి 14న తేదీన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో గల ఇప్పటంలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14న మధ్యాహ్నం 2 : 30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది.