సింగరేణిలో ఈ నెల 7వ తేదీన అడ్రియాల లాంగ్ వాల్ గని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగ ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాగ ఈ ఘటనపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియ జేశారు. కాగ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాల్లో అర్షత ఉన్న వారికి.. వారు కోరుకున్న ప్రాంతాల్లో ఉద్యోగం ఇస్తామని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు.
కాగ ప్రమాద జరిగిన వెంటనే అధికారులు స్పందించారని తెలిపారు. పై కప్పు కూలడంతో మొత్తం ఆరుగురు చిక్కుకున్నారని తెలిపారు. అయితే రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే స్పందించి.. గనిలోకి వెళ్లారని తెలిపారు. గనిలో చిక్కుకున్న ఆరుగురిలో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారని తెలిపారు. అయితే మిగతా వారిని కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారని అన్నారు. అయినా.. ఫలితం దక్కలేదని అన్నారు.