కేసీఆర్ కు అండగా నిలబడ్డ చిరంజీవి

-

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. భారత్ లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వైరస్ ను సీరియస్ గా నే తీసుకున్నారు. ఈ నెలాఖరి వరకూ కూడా రాష్ట్రంలో స్కూళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలియజేశాడు.

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే.. కరోనా ఎఫెక్ట్ ప్రభావంతో తన సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరనమని ఆయన తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తతోొ వ్యవహరించాలని సూచించారు. వైరస్ ను నియంత్రించే క్రమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఈ నిర్ణయానికి అందరూ సహకరిస్తారని ఆశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరిలోొ ధైర్యాన్ని,నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కూడా కొన్ని ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తున్న పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాని చిరంజీవి పేర్కొన్నారు. అయితే సినిమా షూటింగ్ లలో పెద్ద ఎత్తున సాంకేతిక నిపుణులు పాల్గొంటారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 15 నుంచి 15 రోజుల పాటు షూటింగ్ వాయిదా వేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news