Mehreen Pirzada : పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న ”ఎఫ్‌-3” భామ

-

టాలీవుడ్‌ భామ మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా… హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు కాంగ్రెస్‌ నేత భవ్య బిష్ణోయ్‌ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిందరి ఎంగేజ్మెంట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. తర్వలో పెళ్లీ పీఠలు ఎక్కనున్న తరుణంలో కరోనా వీరి పెళ్లికి బ్రేక్‌ వేసింది. అయితే కరోనాతో వాయిదా పడ్డ వీరి పెళ్లి.. పూర్తిగా రద్దయింది. అవును.. భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకున్న మెహ్రీన్‌… దాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నట్లు ప్రకటించేసింది.

ఇకపై వారిద్దరి మధ్య కానీ, బిష్ణోయ్‌ కుటుంబంతో కానీ ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పింది మెహ్రీన్‌. ఈ విషయంలో తన హార్ట్‌ చెప్పినట్లే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. దీన్ని తన శ్రేయోభిలాషులు, అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు మెహ్రీన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్‌ వేదికగా.. ఓ పోస్ట్‌ పెట్టింది. కాగా.. మెహ్రీన్‌ ప్రస్తుతం ఎఫ్‌-3 మూవీలో చేస్తున్న సంగతి విదితమే.

 

Read more RELATED
Recommended to you

Latest news