ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ఐఎండీ సూచించింది.2 రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. కాగా, ఇప్పటికే రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో జోరుగా వర్షాలు పడుతున్నాయి.