గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఆయా శాఖల్లో జరిగిన అవినీతిలో వెలికితీసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్దన ఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించారు. దీంతో ఆయా శాఖల నుంచి రిపోర్టులను తెప్పించునేకుందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొందరు అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేశారని గుర్తించారు. దీంతో వారి జాబితాను అధికారులు రెడీ చేసినట్లు సమాచారం.
వేల మందికి లక్షల రూపాయలు వేతనాలు వెచ్చించి వైసీపీ పనులకు ఉపయోగించుకున్నారని అభియోగాలు సైతం వచ్చాయి. కొంతమంది అసలు కార్యాలయాలకు రాకుండానే ఐదేళ్ల పాటు వారికి జీతం చెల్లించినట్లు గుర్తించారు. జగన్ హయాంలో ఇష్టారీతిన నియామకాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో ఆయా శాఖల్లో పని చేసి వారి వివరాలు.. అటెండెన్స్ ని అధికారులు సేకరిస్తున్నారు. అలాగే అర్హత లేని వారినీ భర్తీ చేసినట్లు గుర్తించారు. నియామక పత్రాలు, అర్హత డాక్యుమెంట్ల పరిశీలనపై దర్యాప్తు చేయించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది.