మెట్రోరైళ్లకు రబ్బరు టైర్లు?

-

మెట్రో రైళ్లకు రబ్బరు టైర్లను పెడితే ఎలా ఉంటుంది? ఇప్పటికే పలు దేశంలోని పలు నగరాల్లో ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి సుఖంగా, వేగంగా గమ్యస్థానానికి చేరడానికి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇలా అన్ని ప్రధాననగరాల్లో మెట్రోరైల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. అయితే దీనిలో ప్రస్తుతం అవి సాధారణ రైళ్ల కంటే ప్రమాణాల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయితే వీటికి ఈ రైళ్లకు రబ్బరు చక్రాలు అమర్చితే ఖర్చు బాగా తగ్గుతుంది. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్రం కమిటీని వేసింది. ఆ విషయాలు తెలుసుకుందాం…

మెట్రో రైల్ లేదా మెట్రోలైట్ వంటి ఉక్కు చక్రాలకు బదులుగా రబ్బరు టైర్లపై నడిచే మెట్రో ఆన్ టైర్స్ కోసం ఒక ప్రమాణాలు, ప్రత్యేకతలను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మెట్రో ఆన్ టైర్లు మెట్రో రైలు, మెట్రోలైట్ రెండింటి కంటే చాలా తక్కువ.

మెట్రో రైలుకు కిలోమీటరుకు రూ .300 కోట్లు, మెట్రోలైట్‌కు రూ .100 కోట్లు అయితే మెట్రో ఆన్ టైర్‌లకు రూ .60 కోట్లు ఖర్చవుతాయని అధికారులు తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను ఆధారంగా వాటి పనితీరు, సాంకేతిక ప్రమాణాలన్నింటిని పరిశీలించిన తర్వాత రాష్ర్టాలు స్వీకరించడానికి పబ్లిక్ డొమైన్లలో ఉంచుతారు. తర్వాత వాటిని వినియోగంలోకి తీసుకవస్తారు. ప్రస్తుతం రబ్బరు టైర్ల పరిశీలనను ద్వారాకా సెక్టార్ 25 నుంచి కీర్తినగర్ వరకు20 కి.మీ పరిధిలో పరీక్షిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే మెట్రో ప్రయాణ చార్జీలు కూడా తగ్గుతాయట!

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news