సోషల్ మీడియాలో మోడీని కొట్టే మొనగాడే లేడా..?.. మరో రికార్డ్..

-

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న మీడియా.. ఈ కొత్త టెక్నాలజీని నాయకులు కూడా అందిపుచ్చుకుంటేనే నేటి రాజకీయాల్లో రాణిస్తారు. ఈ విషయాన్ని అందరికన్నా ముందు పసిగట్టిన నేత నరేంద్ర మోడీ. సోషల్ మీడియాను విస్తృతంగా వాడటం వల్లే 2104లో మొదటిసారి మోడీ ప్రధాని అయ్యాడని భావించే వారు ఉన్నారు.

ఇప్పుడు నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించారు. ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆయన కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ యాప్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 3 కోట్లు దాటింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లున్న నాయకుడు మన మోడీనే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో మోదీ కంటే వెనకే ఉన్నారు.

అసలు ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య మూడు కోట్లు దాటిన తొలి నేత కూడా మోడీనే. బీజేపీ కార్యనిర్వా హక అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ట్వీట్లో ఈ విషయం తెలిపారు. యూత్ లో మోడీకి ఉన్న క్రేజ్ కు తాజా ఘనత ఓ సాక్ష్యమని నడ్డా అంటున్నారు. ఇక ట్విటర్‌లోనూ మన ప్రధాని దున్నేస్తున్నారు. ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 కోట్లు పైమాటే.

Read more RELATED
Recommended to you

Latest news