కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్..హాట్ ఫేవరెట్ గా ముంబై…!

-

ఎన్నో అంచనాలు.. మరెన్నో అవాంతరాలు దాటుకొని స్టార్ట్‌ అయిన ఐపీఎల్ చివరి అంకానికి చేరింది. బంతికి బంతికి మారిన ఆధిపత్యాలు, సూపర్‌ ఓవర్ల పోరాటం ఇలా ఎన్నో మలుపులతో జరిగిన ఈ ఐపీఎల్ సీజన్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది. లీగ్‌ స్టేజిలో టేబుల్‌ టాపర్లుగా ఉన్న ముంబై, ఢిల్లీ జట్టే ఫైనల్‌లో తలపడనున్నాయ్‌. నాలుగు సార్లు కప్‌ కొట్టిన ముంబైను ఓడించడం ఢిల్లీకి సవాల్‌తో కూడున్నపనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై టీమ్ తన స్టామినా చూపిస్తోందా..? లేదా ఢిల్లీ తన ఫస్ట్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంటోందా..? అనే ఉత్కంఠ ఏర్పడింది.

ఈ ఫైనల్‌లో ముంబై టీమ్‌ ఫేవరేట్‌. అన్ని విభాగాల్లో స్ట్రాంగ్‌గా ఉంది. ముంబైకు రోహిత్‌ కెప్టెన్సీయే ప్లస్‌ పాయింట్‌. జట్టుని ముందుండి నడిపించడంలో రోహిత్‌కు రోహితే సాటి. జట్టు నిండా టాప్‌ ప్లేయర్స్‌.. బెస్ట్‌ ఫినిషర్స్‌.. జట్టును ఓటమి నుంచి విజయం వైపు నడిపే వీరులు.. కష్టకాలంలో అండగా నిలిచే ఆల్‌రౌండ్‌ హీరోలు.. వీటన్నింటినీ మించి అత్యుత్తమ కెప్టెన్‌.! అండగా ఉండే కోచింగ్‌ స్టాఫ్‌..! ఇదీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ప్రస్థానం.ఐపీఎల్‌లో నాలుగు టైటిల్స్‌ కొట్టిన ఏకైక కెప్టెన్‌. డెత్‌ బౌలింగ్‌లో ముంబైని మించిన మరో టీమ్‌ లేదు. బుమ్రా, బౌల్ట్‌లతో ముంబై బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. హార్థిక్‌, పొలార్ట్‌ లాంటి పవర్‌ హిట్టర్స్‌ ముంబై సొంతం. ఇక ఈ సీజన్‌లో డికాక్‌, కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ముంబైకి తిరుగులేదు. బుమ్రా ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 27 వికెట్లు తీసి ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు.

ఇక ఢిల్లీలో ఎక్సపీరియన్స్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధావన్‌. కుర్రాళ్లు ఎక్కువగా ఉన్న ఈ టీమ్‌కు శిఖర్‌ ధావన్‌ అనుభవం ప్లస్‌ పాయింట్‌. ఓపెనర్‌గా దిగే శిఖర్ ధావన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ హోప్స్ పెట్టుకుంది. ఢిల్లీలో మరో ఇంట్రెస్టింగ్‌ ప్లేయర్‌ మార్కస్‌ స్టొయినిస్‌. ఢిల్లీ కష్టాల్లో ఉన్నప్పుడు తన పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో ఆదుకుంటున్నాడు స్టొయినిస్‌. ఈ సీజన్‌లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ కీ ప్లేయర్స్‌ ఉన్నారు. వీరు క్షణాల్లో మ్యాచ్‌ స్థితిని మార్చగలరు. ఫస్ట్‌..ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ గురించి చెప్పుకుందాం..! ఐపీఎల్‌లో వన్‌ ఆఫ్‌ ది క్లాసికల్‌ ప్లేయర్‌ శ్రేయస్. ఈ కుర్ర కెప్టెన్‌పై ఢిల్లీ చాలా ఆశలు పెట్టుకుంది. గతేడాది ఢిల్లీని టాప్‌ 3 ప్లేస్‌లో నిలబెట్టాడు ఈ యంగ్‌ కెప్టెన్‌. ఫస్ట్‌ మ్యాచ్‌లో తన కెప్టెన్సీ తెలివితేటలతోనే ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news