కర్ణాటకలో బీజేపీ దూకుడు..ఆ నియోజకవర్గంలో తొలి విజయం…!

-

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఎస్ యడియూరప్ప ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యింది. బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు జీరో అయ్యాయి. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర, శిరాలో బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థి మునిరత్న మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. శిరా నియోజకవర్గంలో బీజేపీ తొలిసారి కాషాయజెండా ఎగరేసింది.శిరా చరిత్రలోనే బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.


బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరినగర్)లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే కురుక్షేత్రం సినిమా ఫేమ్ మునిరత్న మొదటి నుంచి ధీమాగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మునిరత్నకు 1,25,734 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుసుమాకు 67,798ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి క్రిష్ణమూర్తికి 10, 251 ఓట్లు మాత్రమే వచ్చాయి. మునిరత్న 57, 936 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తుమకూరు జిల్లాలోని శిరా శాసన సభ ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ మంత్రి సత్యనారాయణ ఆకస్మిక మరణంతో శిరాలో ఉప ఎన్నికలు జరిగాయి. శిరా శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ నుంచి రాజేష్ గౌడ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి టీబీ. జయచంద్ర, జేడీఎస్ పార్టీ నుంచి అమ్మాజమ్మ పోటీ చేశారు. మొదటిసారి శిరాలో బీజేపీ జెండా ఎగరేసింది.బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడ 12,949 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news