యాప్స్ లో లోన్ తీసుకుంటున్నారా.. పరువు తీస్తారు జాగ్రత్త !

-

మైక్రో ఫైనాన్స్ ఆప్స్ పేరుతో భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మైక్రోఫైనాన్స్ లపై కేసు నమోదు అయ్యాయి. మైక్రో ఫైనాన్స్ యాప్స్ లో రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తారు. ప్రకటనలు చూసి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు మొబైల్ యూజర్స్.  రుణం తీసుకున్న అప్పట్నుంచి వేధింపులకు గురి చేస్తున్నాయి మైక్రోఫైనాన్స్ యాప్స్.

డబ్బులు చెల్లించడంలో గంట లేట్ అయినా వేధింపులు తీవ్రంగా ఉంటున్నాయని అంటున్నారు.  లోన్ తీసుకున్న వ్యక్తి కి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరికీ బెదిరింపు కాల్ చేస్తున్నారు మైక్రోఫైనాన్స్ ప్రతినిధులు. రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో, ఆంధ్ర ప్రదేశ్ లాలీ ఒకరిద్దరు ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ఈ అంశం మీద సీరియస్ గా ద్రుష్టి సారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news