టీకా ఉత్సవ్ : మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌ ముఖ్యమన్న ప్రధాని

-

కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ టీకా ఉత్సవ్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికి కరోనా టీకా ఇవ్వాలనే లక్ష్యంతో ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నేడు టీకా ఉత్సవ్‌ ప్రారంభమైంది. టీకా ఉత్సవ్‌ కరోనాపై చేయబోతున్న రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

 

టీకా ఉత్సవ్‌ ప్రారంభమవుతున్న ఏప్రిల్‌ 11న జ్యోతిబా ఫులే జయంతి అని… ఈ కార్యక్రమం ముగుస్తున్న ఏప్రిల్‌ 14 న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జన్మదినం అని ఈ రెండు తేదీలకు ఉన్న విశిష్టతను ప్రధాని గుర్తుచేశారు.టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వ్యక్తిగత శుభ్రతతో పాటు, సామాజిక పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాలని అన్నారు. అలానే నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. చదువుకోని వారు వృద్ధులు లాంటి వారు ఎవరైతే స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని స్థితిలో ఉన్నారో వారికి మద్దతుగా నిలవాలని ప్రతి ఒక్కరు మరొకరికి టీకా వేయించాలని అన్నారు.

కరోనా చికిత్సకు సరైన వనరులు, దానిపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారికి కరోనా చికిత్స అందజేయడంలో అండగా నిలవాలని… ప్రతిఒక్కరు మరొకరిని చికిత్స అందించాలని కోరారు.ప్రతి ఒక్కరు స్వయంగా మాస్క్‌ ధరించి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరుల్ని కూడా రక్షించాలని దీనికి ప్రతిఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలానే ఎవరైనా కరోనా బారిన పడితే చుట్టుపక్కల వారు మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. భారత్‌ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనాను తరిమికొట్టేందుకు మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌’ విధానం అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news