భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ వెనుకబడ్డ సంగతి తెలిసిందే. చైనా కంపెనీల దెబ్బకు మైక్రోమ్యాక్స్ దుకాణం మూసేసింది. కానీ ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్లో భాగంగా మైక్రోమ్యాక్స్ మళ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ సిరీస్ పేరిట కొత్తగా ఫోన్లను విడుదల చేస్తామని మైక్రోమ్యాక్స్ ఇటీవలే తెలిపింది. చెప్పినట్లుగానే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఆ కంపెనీ మంగళవారం విడుదల చేసింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 1బి పేరిట ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయగా.. ఇన్ నోట్ 1 పేరిట మరో మిడ్ రేంజ్ ఫోన్ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలోనూ అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
మైక్రోమ్యాక్స్ ఇన్ 1 బి స్పెసిఫికేషన్స్…
* 6.52 ఇంచ్ హెచ్డీ ప్లస్ మినీ డ్రాప్ డిస్ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్
* 2/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్…
* 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10, 48, 5, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* గూగుల్ అసిస్టెంట్ బటన్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
మైక్రోమ్యాక్స్ ఇన్ 1బి స్మార్ట్ ఫోన్ పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999గా ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999గా ఉంది. వీటిని నవంబర్ 26 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయిస్తారు.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్ను నవంబర్ 24వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయిస్తారు.