ఐటెం సాంగ్ లో అవకాశం దక్కించుకున్న మిల్క్ బ్యూటీ..ఇక దంచుడే..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా మొదటిసారి తెలుగులో శ్రీ అనే సినిమా ద్వారా పరిచయమై హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా గ్లామర్ షో చేస్తూ.. స్కిన్ షో తో కుర్ర కారును తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కలిసి నటించింది. ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించడమే కాకుండా అవకాశం వస్తే ఐటమ్ సాంగ్ లో కూడా మెరవడానికి సిద్ధంగా ఉంటుందని నిరూపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే దాదాపుగా ఇండస్ట్రీలోకి వచ్చే 17 సంవత్సరాల అవుతున్నా.. తన హీరోయిన్ స్థానాన్ని చెరపకుండా అదే స్థాయిలో దూసుకుపోతున్న తమన్నా కు ఇటీవల పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగులో నటించడానికి అవకాశం వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలో గత కొన్ని రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రకరకాల వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు రావడం జరిగింది. మొదటి పార్ట్ లో సౌత్ టాప్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేసి బాగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇక ఈ ఒక్క ఐటెం సాంగ్ తో సమంత పేరు మారుమ్రోగింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.


ఇకపోతే మొదటి పార్ట్ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు రెండవ పార్టులో ఎవరు చేయబోతున్నారు అనే ఆత్రుత అందరిలో నెలకొంది. ఇక ఈ క్రమంలోని ఇప్పటికే మలైకా అరోరాను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నారట సుకుమార్. ఇప్పుడు తాజాగా తమన్నా ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే పేరుకే ఐటమ్ సాంగ్ అయినా కూడా ఈ సాంగ్ గిరిజన నేపథ్యంలో ఉండి.. కథలో భాగమవుతుందట. అందుకే ఈ పాట కోసం తమన్నా లాంటి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆలోచన కూడా చేస్తున్నారట సుకుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version