పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర్ కలుపుకొని కనుక తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అని గంజాయి స్మగ్లర్స్ కొత్త ప్రచారం చేస్తున్నారు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో రెండు రోజులు క్రితం దాడులు జరిపి కిరాణా షాప్ యజమాని మనోజ్ కుమార్‌ను అరెస్ట్ చేసారు సైబరాబాద్ SOT పోలీసులు. 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో మిల్క్‌షేక్ చేస్తున్నారు. ఇది తాగితే ఏడు గంటలు మత్తు దిగదు.
సరఫరాదారు మోహన్ పరారీలో వున్నాడు. గంజాయి పొడిని కిలో రూ. 2,500 చొప్పున ఆ పొడి తో చేసిన ఒక్కో చాక్లెట్‌ను రూ. 40కి అమ్ముతున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.