భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులలో ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసింది. దీనిపై RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య ఏ అన్నారు. గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించింది. కొంచెం వ్యవస్థను చక్కదిదిద్దండి అని నేను ఎన్ని సార్లు బహిరంగంగా వేడుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి గుండె కరగలేదు అని అన్నారు.
24 గంటలూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఆనాడు కేసీఆర్ గారి హాయంలో పెట్టిన పనేషియా కమాండ్ సెంటర్, విజిలెన్స్ వ్యవస్థ నేడు నిరాదరణకు గురైంది అని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎలా నిరాదరణకు గురైందో వ్యవస్థ కూడా అంతే అన్నారు. ప్రతీకార రాజకీయాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రేసుకు పేద బిడ్డల కడుపుల్లో వాళ్లకు తెలియకుండానే విషమెట్ల పడుతున్నదో తెలిసే అవకాశమే లేదు అని అన్నారు.