ఆదిలాబాద్ కాల్పుల కేసులో ఎంఐఎం నేత‌కు జీవిత ఖైదు

-

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020 డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన కాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒక‌రు మర‌ణించ‌గా.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌కు కూడా దారి తీసింది. కాగ ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్య‌క్షుడు ఫారూఖ్ అహ్మ‌ద్ కు జీవిత ఖైదు ప‌డింది. ఈ కేసును ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిలాబాద్ జిల్లా ప్ర‌త్యేక కోర్టు విచారించిది. ఈ కేసులో ఫారూఖ్ అహ్మ‌ద్ ను ప్ర‌త్యేక కోర్టు సోమ‌వారం దోషిగా తెల్చింది. దీంతో ఫారూఖ్ అహ్మ‌ద్ కు జీవిత ఖైదుతో పాటు రూ. 12 వేల జ‌రిమానా విధించింది.

అలాగే ఈ కాల్పుల కేసులో ఏ – 2 గా ఉన్న ఫెరోజ్ ఖాన్, ఏ – 3 గా ఎండీ హ‌ర్ష‌ద్ ల‌ను నిర్ధోషుల‌ని ప్ర‌త్యేక కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే 2020 డిసెంబ‌ర్ 18 న పిల్ల‌ల ఆట‌లో వివాదం వ‌చ్చి కాల్పుల వ‌ర‌కు వెళ్లింది. అలాగే ఘ‌ర్ష‌ణ‌లు కూడా జ‌రిగాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఫారూఖ్ అహ్మ‌ద్ ఒక చేతిలో త‌ల్వార్, మ‌రో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల‌లో మాజీ కౌన్సిల‌ర్ స‌య్య‌ద్ జ‌మీర్, మ‌న్నాన్, మోతేసీన్ లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే మాజీ కౌన్సిల‌ర్ స‌య్య‌ద్ జ‌మీర్ తీవ్రంగా గాయప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అదే నెల‌లో 26 వ తేదీ న మ‌ర‌ణించాడు. అప్పుడు ఫారూఖ్ తోప‌టు ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ జ‌రిపి సోమ‌వారం జీవిత ఖైదు విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news