అన్నదే అయింది.. జేసీ దివాకర్ రెడ్డి మీద మైనింగ్ కేసు !

-

నిన్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంత మైన్స్ ఆఫీస్ ముందు హల్చ చేశారు. ఈ సంధర్భంగా తనకి అన్నం పెట్టె మైన్స్ ని కూడా ఆపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆరోపించినట్టుగానే జేసీ దివాకర్ రెడ్డి మీద మైనింగ్ కేసు నమోయింది. జేసీ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన మైనింగ్ అధికారులు, జేసీ దివాకర్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ నిర్వహిస్తున్నారు.

అయితే కార్మికుల భద్రతను గాలికొదిలేసిన జేసీ దివాకర్ రెడ్డి, మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు చేయించడం లేదని గుర్తించింది మైన్స్ శాఖ. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను నిర్వహిస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక ఈ అంశం మీద మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు మాట్లాడుతూ నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందన్న ఆయన ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news