అమరావతి అనేది పెద్ద స్కామ్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతోనైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఏప్రిల్ నుంచి విశాఖ వేదికగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తారని అమర్నాథ్ తెలిపారు. ‘చంద్రబాబు రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’ అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
‘సుప్రీంకోర్టు తీర్పుతోనైనా చంద్రబాబుకు బుద్ధి రావాలి. సుప్రీం వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరగాలి.అన్ని ప్రాంతాలకు మేలు జరగాలనే మూడు రాజధానులు. అమరావతి కూడా అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాం. రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు.. గుర్తింపు కార్డులు అడిగితే అమరావతి పాదయాత్ర రైతులు పారిపోయారు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.